Gangster Gangaraju : బుర్ర కథగా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ టీజర్!

Gangster Gangaraju : సస్పెన్స్ థ్రిల్లర్ ‘వలయం’ లో యాక్షన్ హీరో గా కన్పిపించిన ‘లక్ష్ చదలవాడ’ మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ తో రాబోతున్నాడు. న్యూ ఇయర్ శుభాకాంక్షలతో దీని టీజర్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్ పూర్తిగా యాక్షన్ దృశ్యాలతో కూడుకుని వుంది. బుర్ర కథ నేపథ్యంలో దుష్టుల్ని చితగ్గొట్టే యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో స్టైల్‌గా ఎంట్రీ ఇస్తాడు లక్ష్.

గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు, పాటలకు అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా టీజర్‌ మరింత ఆసక్తి రేపేలా వుంది. ‘అధిగదిగో మన గ్యాంగ్‌స్టర్ గంగరాజు రానే వచ్చాడు’ పాటతో లక్ష్ పరిచయం పర్ఫెక్ట్ ఎలివేషన్ ని ఇస్తుంది. సీనియర్ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ ఒక ప్రధాన పాత్రలో కనిపించడం విశేషం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మొత్తం టీజర్ ఎపిసోడ్ బుర్ర కథగా చెప్పారు. గ్యాంగ్ స్టర్ గా యాక్షన్ మధ్యలో రొమాన్స్, ఫన్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. దుష్ట శిక్షణ చేస్తూ చివరికి రావణుడి దిష్టిబొమ్మను లక్ష్ దహనం చేయడంతో టీజర్ ముగుస్తుంది.

Gangster Gangaraju Telugu Teaser | Laksh Chadalavada | Vedieka Dutt | Eeshaan Suryaah | Sai kartheek

 

టీజర్ ముగింపులో వెన్నెల కిషోర్ డైలాగ్- ‘టైటిల్ దుమ్మురేపింది’ అని డైలాగు కొడితే, శ్రీకాంత్ అయ్యంగార్ యొక్క సమాధానం- ‘కథ నా దుమ్ము రేపింది’ అని డైలాగ్ కొట్టడం వుంది. ఎంత దుమ్మురేపుతుందో సినిమా చూస్తే తెలుస్తుంది.

టీజర్ లో రివీల్ అయిన విషయాన్ని బట్టి దీన్ని రొటీన్ మాస్ యాక్షన్ మూవీగానే దీన్ని భావించుకోవాలి.

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. వేదికా దత్‌ కథానాయిక. చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.