ట్రైల‌ర్ టాక్‌: దిశ హంత‌కుడు ఎవ‌రు?

షాద్‌న‌గ‌ర్ స‌మీపంలోని తొండుప‌ల్లి టోల్ ప్లాజా స‌మీపంలో జ‌రిగిన ద‌షా ఘ‌ట‌న యావ‌త్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. బాదితురాలికి వెంట‌నే న్యాయం జ‌ర‌గాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌నం గొంతెత్తి స్పాట్ జ‌స్టీస్ కోసం నిన‌దించారు. ఆ వెంట‌నే దిషా హంత‌కుల ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌డం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌లో వాడిన దిషా పేరుని `వ‌ల‌యం` చిత్రానికి వాడేశారు. ల‌క్ష్య్‌, `హిప్పీ` ఫేమ్ దిగాంగ‌న సూర్య‌వ‌న్షీ జంట‌గా న‌టిస్తున్నారు. చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు నిర్మిప్తున్నారు. స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా ర‌మేష్ కడుముల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ చిత్ర ట్రైల‌ర్‌ని హీరో అడివి శేష్‌ ఆదివారం విడుద‌ల చేశారు. హీరో, హీరోయిన్‌ల పెళ్లి చూపుల స‌న్నివేశంలో ట్రైల‌ర్ మొద‌లైంది. ఆ త‌రువాత పెళ్లి…ఊటీలో కొత్త జంట పాట‌… ప‌డ‌క‌గ‌ది స‌న్నివేశాలు..రొమాన్స్‌.. క‌ట్ చేస్తే దిష అడ్ర‌స్ గ‌ల్లంతు. త‌న భార్య క‌నిపించ‌డం లేద‌ని పోలీస్‌స్టేష‌న్‌కి వెళ్లి హీరో కంప్లైంట్ ఇస్తాడు. అక్క‌డి నుంచి క‌థ మ‌లుపులు తిరుగిన తీరు ఆక‌ట్టుకుంటోంది. విచార‌ణ పేరుతో హీరోపై పోలీసుల అనుమానం మొద‌ల‌వుతుంది. అత‌న్ని వెంబ‌డించే స‌న్నివేశాలు..అది తెలిసి వారిని ఎలా దారి మ‌ళ్లించాలా అని హీరో ఆలోచిస్తున్న తీరు ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.

ట్రైల‌ర్ చివ‌రలో `నువ్వే నీ భార్య‌ని పంచావ్‌` అని పోలీసులు ఎదురుప్ర‌శ్నించ‌డం, ఆ వెంట‌నే ఓ బ్లాక్ స్కార్పియో ఓ వ్య‌క్తిని యాక్సిడెంట్ చేస్తే అత‌ను గాల్లో ప‌ల్టీలు కొడుతూ ప‌డిపోతున్న దృశ్యాలు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. చాలా కాలంగా త‌రువాత చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు త‌న‌యుడు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా థ్రిల్ల‌ర్ చిత్రాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలాగే క‌నిపిస్తోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్‌పై మీరూ ఓ లుక్కెయ్యండి.

Valayam Movie Trailer 4K | Laksh Chadalavada | Digangana | STTV Films