చిరు సినిమాలో అద్భుతమైన రోల్ కి ఛాన్స్ కొట్టేసిన గంగవ్వ.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో భారీ సినిమా “ఆచార్య” కంప్లీట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రెండు రీమేక్ సినిమాలు కూడా మెగాస్టార్ లైన్ లో పెట్టుకున్నారు. మరి వీటిలో “గాడ్ ఫాథర్” కూడా ఒకటి. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూట్ ఫుల్ శరవేగంగా ఇప్పుడు కొనసాగుతుంది.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. బిగ్ బాస్ సహా యూట్యూబ్ ఫేమస్ గంగవ్వ ఈ సినిమాలో నటిస్తున్నారట. అది కూడా చాలా స్పెషల్ రోల్ ఏకంగా మెగాస్టార్ కి తల్లి పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఇది గంగవ్వ కి ఓ అద్భుతమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇక సినిమాలో వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందా అని ఇప్పుడు నుంచే ఆసక్తి మొదలయ్యిపోయింది.