Ram Charan: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు చెర్రీ. ఆ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా బాలయ్య బాబు హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే లో పాల్గొన్నారు. ఎనిమిదో ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. గేమ్ చేంజర్ ప్రమోషన్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు చరణ్.
మంగళవారం ఉదయం 7 గంటల నుంచే షూటింగ్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా రిలీజ్ చేసింది ఆహా. ఆ ఫోటోలలో చరణ్ మరింత స్టైలీష్ గా కనిపిస్తుండగా చెర్రీతో పాటు టాలీవుడ్ హీరో శర్వానంద్ సైతం సందడి చేశారు. అయితే షోలో బాలయ్య బాబు అలాగే హీరో శర్వానంద్ ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుకున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్ బాలయ్య బాబు ఇద్దరు కలిసి చిరంజీవి ఫుల్ గా ఆట పట్టించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు సంబంధించిన వీడియోలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇకపోతే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ విషయానికి వస్తే..
ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతుండగా బాలయ్య బాబు హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై కూడా భారీగా అంచనాలను ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గేమ్స్ చేంజర్ మూవీ పై ఎక్కువగా అంచనాలు ఉన్నాయని చెప్పాలి. ఈ రెండు సినిమాలకు పోటీగా విక్టరీ వెంకటేష్ నటించిన ఇంకా సంక్రాతికి వస్తున్నాం సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.. వీటిలో ఏ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..