Pushpa Movie A Real Smuggler : రియల్ స్మగ్లింగ్ గురూ..”పుష్ప” సినిమా చూసి అట!లాస్ట్ లో అసలు ట్విస్ట్

Pushpa Movie A Real Smuggler :ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “పుష్ప పార్ట్ 1”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ పరంగా సెన్సేషన్ ని కొనసాగించగా తర్వాత శ్రీవల్లి, తగ్గేదేలే ట్యాగ్స్ తో ఇంటెర్నేషల్ వైడ్ కూడా ఓ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇలా వైరల్ అవుతున్న ఈ చిత్రం పై మరియు హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ పై ప్రముఖ తెలుగు భాషా పండితులు మరియు హైందవ ధర్మ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చేసిన కొన్ని సంచలన కామెంట్స్ బన్నీ అభిమానులు మూవీ లవర్స్ లో పెద్ద ఎత్తున కలకలం రేపగా..

ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. గరికపాటి మాట్లాడుతూ ఏదైతే మాట అన్నారో నిజంగానే ఇప్పుడు పుష్ప సినిమా చూసిన తర్వాత జరిగింది. కేరళకి చెందిన ఓ స్మగ్లర్ పుష్ప సినిమాని చూసి ప్రేరణ చెంది నిజంగానే ఆ సినిమా తరహా స్మగ్లింగ్ ని ప్లాన్ చేసాడట.

అయితే ఈ సరుకు ఏకంగా రెండున్నర కోట్లకు దగ్గర ఉంటుందని తెలిసింది. అయితే ఇలా ప్లాన్ చేసిన స్మగ్లింగ్ ని ప్లాన్ చేసుకున్న అతడు ఆ ఎర్ర చందనం దుంగలని కొన్ని కూరగాయల పెట్టెలుతో కప్పేసి ట్రక్ లో తీసుకెళ్లాడు. కానీ లాస్ట్ కి మహారాష్ట్ర పోలీస్ కి దొరికేసాడు.

దీనితో ఈ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకున్న ప్లానింగ్ ని పోలీసులు ఆ దుంగలు ఆ స్మగ్లర్ ని పట్టుకొని ఫోటో పెట్టి అసలు మేటర్ తెలిపారు. దీనితో ఈ రకంగా పుష్ప సినిమా ప్రభావం చూపించింది.