నేచురల్ స్టార్ నాని ‘దసరా’ నుండి ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్‌లో కనిపిస్తున్నారు.

ఈ చిత్రం కోసం మాస్, రగ్డ్ గా మేకోవరైన నాని..  తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. అలాగే చిత్ర షూట్‌లో ఎక్కువ భాగం హ్యుమిడిటీతో కూడిన పరిస్థితులలో జరుగుతుంది. నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా  భారీ స్థాయిలో ‘దసరా’ రూపొందుతోంది.

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా నాని,  అతని గ్యాంగ్‌తో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో నాని అండ్ కో రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య కూర్చొని అందరూ నవ్వుతూ కనిపించారు. అందరిముఖంలో గొప్ప సంతోషం కనిపిస్తున్న ఈ పోస్టర్ ఫ్రెండ్‌షిప్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ గా నిలిచింది.

నాని ఫుల్ లెంత్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలకో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. కీర్తి సురేష్ ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా కనిపించనుంది.

ఇప్పటికే విడుదలైన  స్పార్క్ ఆఫ్ దసరా  గ్లింప్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది నాని మాస్ గెటప్, టెర్రిఫిక్ అవతార్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.

సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక  పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు

ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్

డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ

సంగీతం: సంతోష్ నారాయణన్

ఎడిటర్: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్ : విజయ్‌ చాగంటి

ఫైట్స్: అన్బరివ్

పీఆర్వో: వంశీ- శేఖర్