తేజ కొత్త చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్

దర్శకుడు తేజ సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచయం చేశారు వారిలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఒకరు. జై సినిమాతో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం కొనసాగించారు. ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు.

తేజ అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరోసారి వీరి కలయికలో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంభందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ గోవాలో జరుగుతున్నాయి.

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మరియు తేజ, అనూప్ రూబెన్స్ కలిసి వర్క్ చేస్తున్న ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దర్శకుడు తేజ, అనూప్ రూబెన్స్, చంద్రబోస్ మ్యూజిక్ లవర్స్ కు వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.