ఇది ఓటీటీల జనరేషన్. ఓటీటీలు లేని జీవితాన్ని ఇప్పుడు ఊహించుకోలేము. ఏనాడైనా మనం అనుకున్నామా? సినిమాలు థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఇంటర్నెట్ లోనే రిలీజ్ అవుతాయని. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ ఈ జనరేషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. దానిలో భాగంగానే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చేశాయి.
కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీల వాడకం ప్రస్తుతం బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఓటీటీల్లో పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో ఓటీటీలకు సబ్ స్క్రిప్షన్లు కూడా పెరుగుతున్నాయి.
అయితే.. అందరూ ఓటీటీలకు సబ్ స్క్రైబ్ చేసుకోలేరు కదా. అటువంటప్పుడు ఓటీటీల్లో ఉచితంగా సినిమాలు చూడలేమా? అంటే చూడొచ్చు.. అని చెబుతోంది యూఎస్ కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్.
పేరుకు ఇది యూఎస్ ఓటీటీ అయినా.. ఇండియాలో కూడా దీనికి చాలామంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ లు కానీ.. సినిమాలు కానీ చూడాలంటే సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సిందే.
అయితే.. ఇటీవల నెట్ ఫ్లిక్స్ కస్టమర్ల కోసం కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాలను ఉచితంగా అందిస్తోంది. నెట్ ఫ్లిక్స్ యాప్ లో కాకుండా… నెట్ ఫ్లిక్స్ వెబ్ సైట్ కు వెళ్లి ఉచితంగా సినిమాలను చూసే చాన్స్ ఉంది.
దాని కోసం లాప్ టాప్, డెస్క్ టాప్ నుంచి బ్రౌజర్ ఓపెన్ చేసి.. https://www.netflix.com/in/watch-free వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే చాలు. నెట్ ఫ్లిక్స్ లో ఉచితంగా లభించే సినిమాలను చూడొచ్చు. ఇందులో ఎక్కువగా అమెరికన్ వెబ్ సిరీస్ లు, షోలు, హాలీవుడ్ సినిమాలు ఉంటాయి.
ఇంకెందుకు ఆలస్యం..అస్సలు టైమ్ పాస్ కాకపోతే పైన చెప్పిన వెబ్ సైట్ ఓపెన్ చేసి నెట్ ఫ్లిక్స్ లో ఉచితంగా సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి..