ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(60) మృతి చెందారు. మాణిక్యాలరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు వారాల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకింది. మరోవైపు లివర్ ఇన్ఫెక్షన్ కూడా సోకడంతో, ఆయనకు కరోనాతో పాటు లివర్ డిసీజ్‌కు కూడా చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో, ఆయ న్ని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆయన పరిస్థితి పూర్తిగా విషమించడంతో మాణిక్యాలరావు తుది శ్వాస విడిచారు. 2014లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మాణిక్యాలరావు, చంద్రబాబు కేబినెట్‌లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.