#HyderabadRains: ఏ ఇంట్లో చూసినా చేపలే.. వరద నీటితో ఇళ్లలోకి కొట్టుకొచ్చిన చేపలు

fish came into homes with flood in hyderabad

హైదరాబాద్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో అందరం చూస్తేనే ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తాయి అవి మామూలు వర్షాలు కాదు. ఆకాశం నుంచి నీళ్లు ఊడి పడినట్టుగా కుండపోత వర్షం కురిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెరువులే కనిపిస్తున్నాయి. రోడ్లయితే కనిపించడం లేదు. హైదరాబాద్ వాసులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

fish came into homes with flood in hyderabad
fish came into homes with flood in hyderabad

ఇదిలా ఉంటే.. ఇళ్లలోకి కొట్టుకొస్తున్న వరదతో పాటుగా పెద్ద పెద్ద చేపలు కూడా వస్తున్నాయి. వరద ప్రవాహంతో పాటు చేపలు కూడా ఇంట్లోకి కొట్టుకు వస్తుండటం చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

ఒక ఇంట్లోనే పదుల కొద్దీ పెద్ద పెద్ద చేపలు కొట్టుకొస్తున్నాయి. నగరంలోకి ఓ ఇంట్లోకి కొట్టుకొచ్చిన వరదతో పాటు చేపలు కూడా వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.