Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి రీమేక్ సినిమా ఏంటో తెలుసా.?

Mega Star Chiranjeevi :  ఇప్పుడు టాలీవుడ్‌లో రీమేక్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని, పవన్ కళ్యాణ్, వెంకటేష్.. ఇలా పలువురు స్టార్ హీరోలతో పాటు, యంగ్ హీరోలు సైతం రీమేక్ మూవీల్లో నటిస్తున్నారు. కాగా, అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలు రీమేక్స్ లిస్టులో వున్నాయ్. ఆ విషయం చాలా మందికి తెలీదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి నటించిన తొలి రీమేక్ మూవీ ‘చట్టానికి కళ్లు లేవు’. ఇది తమిళంలో రజనీకాంత్ నటించిన ‘సట్టం ఓరు ఇరుత్తరయ్’ సినిమాకి రీమేక్. తెలుగులో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మాధవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

చిరంజీవి నటించిన మరో రీమేక్ మూవీ ‘పట్నం వచ్చిన పతివ్రతలు’. ‘పట్టనక్క బంద పత్నియరు’ అనే ఓ కన్నడ సినిమాకి రీమేక్ ఇది. చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. గీత, రాధిక హీరోయిన్లుగా నటించారు.

చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘విజేత’ సినిమా కూడా రీమేక్ మూవీనే. హిందీలో సూపర్ హిట్ అయిన ‘సాహెబ్’ సినిమాకి రీమేక్ ఇది. అలాగే, చిరంజీవి నటించిన మరో సూపర్ డూపర్ హిట్ మూవీ ‘పసివాడి ప్రాణం’ కూడా ఓ మలయాళ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కింది.

ఇలా చెప్పుకుంటూ పోతే, ‘ఘరానా మొగుడు’, ‘ఠాగూర్’, ‘శంకర్ దాదా ఎంబిబియస్’, ‘శంకర్‌దాదా జిందాబాద్’, మొన్నటి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాలు చీరంజీవి నటించిన రీమేక్ సినిమాల లిస్టులో వున్నవే. ఇక లేటెస్టుగా ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ తదితర చిత్రాలు కొత్తగా ఆ ఖాతాలో చేరాయ్.