మొట్ట మొదటి తెలుగు సూపర్ హీరో ఫిల్మ్.. ‘హను మ్యాన్’

First original super hero film Hanu Man
First original super hero film Hanu Man
కొత్తదనాన్ని కోరుకునే దర్శకుల్లో ప్రశాంత్ వర్మ కూడ ఒకరు.  రొటీన్ సినిమాలకు భిన్నంగా కొత్త తరహా కథలను రూపొందించుకుంటాడు ప్రశాంత్ వర్మ. ఆయన చేసిన మూడు సినిమాలు మూడు రకాలు.  ‘అ!, కల్కి, జాంబిరెడ్డి’ మూడు మూడు రకాల సినిమాలు. వీటిలో ‘కల్కి’ కొద్దిగా నిరాశపరచగా మిగతా రెండు సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈసారి కూడ ప్రశాంత్ వర్మ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. అదే ‘హను మ్యాన్’.  పేరులోనే హనుమాన్ అనే శబ్దం ధ్వనిస్తోంది.  భారతీయ పురాణాల్లో హనుమాన్ సూపర్ హీరో ఫిగర్.  కరెక్టుగా చెప్పాలంటే ప్రపంచంలోనే హనుమాన్ మొదటి సూపర్ హీరో. 
 
ఇప్పుడు ఆ సూపర్ హీరో స్పూర్తితోనే ప్రశాంత్ వర్మ ‘హను మ్యాన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.  కొద్దిసేపటి క్రితమే టైటిల్ పోస్టర్ రివీల్ అయింది.  హిమాలయాల నేపథ్యంలో, మంచి లోకేషన్లలో, ఆకట్టుకునే నేపథ్య సంగీతంతో టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది.  తెలుగులో ఇదే మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో ఫిల్మ్ అంటున్నారు ప్రశాంత్ వర్మ.  హాలీవుడ్ చిత్రాల్లోని సూపర్ హీరో క్యారెక్టర్స్ చూసి తెలుగులో కూడ ఇలాంటి సూపర్ హీరో ఫిలిమ్స్ వస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎప్పటి నుండో అనుకుంటున్నారు.  అలాంటి వారందరికీ ప్రశాంత్ వర్మ సినిమా ఒక హాప్ అనిపిస్తోంది.  మరి ఈ సినిమాలో హను మ్యాన్ పాత్రలో ఏ హీరో నటిస్తాడో చూడాలి మరి.