బిగ్ బాస్ సోహెల్ లక్కీ లక్ష్మణ్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్..!

బిగ్ బాస్ ఫేమ్ సొహెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ద్వార పాపులర్ అయిన సోహేల్ బిగ్ బాస్ షో కి రాక ముందు ఎన్నో సినిమాలలో నటించాడు. కొత్త బంగారు లోకం’ సినిమాతో తన యాక్టింగ్ కేరీర్ ను ప్రారంభించిన సోహేల్ ఎన్నొ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ఈ షో ద్వారా సోహేల్ బాగా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత సోహల్ కి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.

ఇప్పటికే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోహెల్ ‘బూట్ కట్ బాలరాజు’ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. దత్తాత్రేయ మీడియా పతాకంపై ఎ.ఆర్ అభి దర్శకత్వంలో, హరిత గోగినేని నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న లక్కీ లక్ష్మణ్ సినిమాలో సోహెల్, మోక్ష జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ పనులు మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈసినిమా నుండి మేకర్స్ ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గెస్ట్ గా హాజరై ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘లక్కీ లక్ష్మణ్’ సినిమా ఫస్ట్ లుక్ చాలా బాగుందని దర్శక, నిర్మాతలతో పాటు టెక్నికల్ టీమ్ ను కూడా ఆయన అభినందించారు. ఇక సోహెల్ గురించి మాట్లాడుతూ.. సోహైల్ బిగ్ బాస్ నుండి తనకు తెలుసు. ఆయన నటన చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు.ఇక ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సోహెల్ ఓ కుర్చీలో కూర్చొని స్టైలిష్ సూట్ ధరించి, చేతిలో ఇండియన్ కరెన్సీని పట్టుకొని న్యూ లుక్ ను ప్రజెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.