పాన్ ఇండియా మార్కెట్ లో సొంతంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. స్టైలిష్ స్టార్ నుంచి పుష్ప అనే సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయి తన క్రేజ్ ని మరింత స్థాయిలో విస్తరించుకున్నాడు.
ఇక ఈ పుష్ప సినిమాని తెరకెక్కించిన సుకుమార్ నెక్స్ట్ పుష్ప 2 కి మరింత ఛాలెంజ్ లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో స్క్రిప్ట్ కాస్టింగ్ అంతా పక్కాగా సెట్ చేసుకున్న తాను షూటింగ్ కి డేట్ ని ఫిక్స్ చెయ్యాల్సి ఉంది. అయ్యితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందిరా బాబు అనుకున్న వారికి నేడు బిగ్ క్లారిటీ దొరికేసింది.
పుష్ప 2 ని సెట్స్ మీదకి ఎక్కించడానికి అన్నీ సిద్ధం చేసేసారు. అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ నవంబర్ రెండో వారం నుంచి బ్యాంగ్ కాక్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇంకా డీటెయిల్స్ లోకి వెళితే సినిమాలో స్పాన్ పెంచగా అక్కడ కీలక సన్నివేశాలతో నవంబర్ 12 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది.
ఇక పుష్ప రాజ్ మేనియా మళ్ళీ రీస్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటుగా తమిళ్ నుంచి మరింత మంది స్టార్స్ ఈ పార్ట్ లో కనిపించనున్నారు.
Yaaaa…Shoot to begin this month. Expect an update in the 2nd week. We shall give all the details soon. pushpAA's rule to begin 🔥 🔥🔥#PushpaTheRule #Pushpa2
— Sarath Chandra Naidu (@imsarathchandra) November 2, 2022