Pushpa : లేటెస్ట్ : “పుష్ప” కి దెబ్బ మీద దెబ్బ..కానీ ఫైనల్ క్లారిటీ మీకోసం.!

Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లాస్ట్ సినిమా “అల వైకుంఠపురములో” తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా కంప్లీట్ చేసాడు. ఇక దీని తర్వాత మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో ఐకాన్ స్టార్ గా మారి చేసిన భారీ సినిమా “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమాని అనుకున్న టైం కి రిలీజ్ చెయ్యాలని ముఖ్యంగా సుకుమార్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

అయితే లాస్ట్ మినిట్ లో దెబ్బ మీద దెబ్బ పడింది. మొదట ఓవర్సీస్ ప్రీమియర్ కి పంపే ప్రింట్ లేట్ అవ్వగా తర్వాత మళ్ళీ ఓకే అయ్యింది. ఐతే మరోపక్క ఊహించని విధంగా పుష్ప వెర్షన్ సెన్సార్ ఆగిపోయింది. దీనితో దానిని కూడా సుకుమార్ కంప్లీట్ చేయించి ఈరోజు టోటల్ ప్రింట్ ని సెన్సార్ కి అందించారు.

అంతే కాకుండా మొత్తం 5 భాషల్లో కూడా మొత్తం మిక్సింగ్ ముంబై లో ఫినిష్ చేశారట. ఎట్టకేలకు ఇన్ని ఇబ్బందులు తర్వాత సుకుమార్ తన భారీ సినిమాని ఎట్టకేలకు అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలో అనసూయ, ఫహద్ ఫాజిల్ మరియు సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈరోజు డిసెంబర్ 16 ప్రీమియర్స్ తోనే ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది.