ఫైనల్ గా మెగాస్టారే వెనకడుగు వేసారుగా..కానీ కష్టమేనా?

టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య” కంప్లీట్ చేసి తన వేరే రీమేక్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే చాలా కాలం నుంచి అందని ద్రాక్షలా ఉన్న మెగాస్టార్ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 4 రిలీజ్ అవుతున్నట్టుగా నిన్న మేకర్స్ కంఫర్మ్ చేశారు.

అయితే ఇంతకు ముందు సినీ వర్గాలు సహా ముఖ్యంగా మెగా వర్గాల నుంచి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 17 నే రిలీజ్ చెయ్యాలని చిరు కొరటాల అనుకున్నా అప్పుడు పుష్ప ఉండడం నిర్మాతలు మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో ఫైనల్ గా ఫిబ్రవరికి ఈ సినిమా షిఫ్ట్ అయ్యింది.

అయితే అసలు ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్ ఉంది. ఫిబ్రవరి నెలలో వచ్చిన సినిమాలు దాదాపు సరిగ్గా ఆడినవి లేవు పైగా పెద్ద హీరోల సినిమాలు కూడా లేవు అందుకే ఈ సినిమా ఫలితం పై ఫిబ్రవరి అనౌన్సమెంట్ తో ఇప్పుడు నుంచే అందరూ డౌట్స్ పడిపోతున్నారు. కానీ ఎట్టాకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చింది అని సంతోషపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు.