ఫైనల్ గా “NTR 30” కి దొరికేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ.!

గత కొన్నాళ్ల నుంచి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 30 వ సినిమా కోసం అలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఈ సినిమాపై ఉన్నప్పటికీ కొన్ని అంశాలు అయితే అలా సమాధానం లేకుండానే ఉన్నాయి. మరి అలనాటి ప్రశ్నల్లో సినిమా హీరోయిన్ ఎవరు అనేది కూడా ఉంది.

ఇక ఈ ప్రశ్నకి అయితే ఇప్పుడు ఫైనల్ గా సమాధానం దొరికేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ గా మళ్ళీ బాలీవుడ్ హీరోయిన్ నే చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆ హీరోయిన్ మరెవరో కూడా కాదట. అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అని కన్ఫర్మ్ అవుతుంది.

లేటెస్ట్ గాసిప్స్ ప్రకారం ఈ బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ ని అయితే చిత్ర యూనిట్ లాక్ చేసారని కన్ఫర్మ్ అయ్యింది. పైగా ఈమె కూడా ఎన్టీఆర్ తో నటించడం పట్ల ఎప్పుడు నుంచో మంచి ఆసక్తిగా ఉంది. అందుకే ఈమెని ఫైనల్ చేసినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే ఈ రూమర్ ని నిజం చేస్తూ చిత్ర యూనిట్ నుంచి ఓ అధికారిక క్లారిటీ కూడా రాబోతుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైతే అయ్యింది కానీ ఎన్టీఆర్ కి మాత్రం బాలీవుడ్ హీరోయిన్ నే చిత్ర యూనిట్ పట్టుకొచ్చారు అని చెప్పాలి. 
Janhvi Kapoor_3