Kgf Chapter 2 : బిగ్ అప్డేట్ : “కేజీఎఫ్ 2” నుంచి ఫైనల్ గా ఆడియెన్స్ కే వదిలేసారు.!

 Kgf Chapter 2 : ఎలాంటి సందేహం లేకుండా ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని వస్తున్న సాలీడ్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు అది “కేజీఎఫ్ చాప్టర్ 2” అనే చెప్పాలి. అప్పుడు మన తెలుగు నుంచి బాహుబలి 2 పై ఎంత హైప్ ఉందో దాని కన్నా మించి ఈ సీక్వెల్ పై అంచనాలు నెలకొన్నాయి.

కన్నడ యంగ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి లతో తీసిన ఈ సినిమాపై తారా స్థాయి అంచనాలే నెలకొన్నాయి. మరి ఏప్రిల్ నెలలో రిలీజ్ కి రెడీ గా ఉన్న ఈ భారీ ఏక్షన్ థ్రిల్లర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ తక్కువే అని చెప్పాలి. ఒక్క గ్లింప్స్ సహా కొన్ని పోస్టర్స్ మాత్రమే ఈ సినిమా నుంచి వచ్చాయి.

కానీ ఫైనల్ గా ఇప్పుడు చిత్ర బృందం బిగ్ అప్డేట్ కి రంగం సిద్ధం చేశారు. నెక్స్ట్ మీకు ఏ అప్డేట్ కావాలో చెప్పండి అని ఒక పోల్ పెట్టి అందులో సాంగ్, ట్రైలర్ మరియు సర్ప్రైజ్ అప్డేట్ అంటూ పెట్టారు. అయితే ఇందులో అంతా ట్రైలర్ కే ఓట్ చేస్తారు కానీ మేకర్స్ అయితే మొదట సాంగ్ నే రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది.

ఈ సినిమాపై ఉన్న హైప్ కి వీడియో రూపంలో వచ్చిన ఏదైనా భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయం. మరి నెక్స్ట్ చిత్ర బృందం ఏ అప్డేట్ రివీల్ చేస్తారా అని ఇప్పటి నుంచే ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దత్ అధీరా అనే పవర్ ఫుల్ విలన్ గా చెయ్యగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.