టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా అలాగే రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనిని నిన్నటి వరకు కూడా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. కానీ లేటెస్ట్ గా మాత్రం భీమ్లా నాయక్ సినిమా రేస్ నుంచి తప్పుకున్నట్టే తెలుస్తోంది.
అక్కడ ట్రిపుల్ ఆర్(RRR) సినిమా కూడా ఉన్నా తగ్గని భీమలోడు ఇప్పుడు ఎందుకు తగ్గాడా అనేది కూడా తెలుస్తోంది. సినిమా నిర్మాతలు పెట్టుకున్న ఒక కీలక భేటి తర్వాత భీమ్లా నాయక్ రిలీజ్ ని వాయిదా వేసుకున్నట్టుగా చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు. మరి దానికి ప్రూఫ్ గా లేటెస్ట్ పోస్టర్ లో ఎక్కడా కూడా రిలీజ్ డేట్ ని వేయలేదు. సో భీమ్లా నాయక్ రిలీజ్ కూడా ఆగిపోయినట్టే అని చెప్పాలి.