Pushpa : ఫైనల్ బాక్సాఫీస్ రిపోర్ట్ : 50 రోజుల్లో ఏడాదికి సరిపడా వసూళ్లు కొల్లగొట్టిన “పుష్ప 1”.!

Pushpa :  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలా అయితే మన టాలీవుడ్ నుంచి వెళ్లి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడో ఇప్పుడు ఇదే బాటలో హిందీ మార్కెట్ లోకి అడుగు పెట్టి రాజమౌళి లేకుండా 100 కోట్లు కొల్లగొట్టిన ఏకైక హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. తన హ్యాట్రి దర్శకుడు సుకుమార్ తో చేసిన తాజా చిత్రం “పుష్ప పార్ట్ 1” తో తన కెరీర్ లో మరో బిగ్ హిట్ ను అందుకొని స్టైలిష్ స్టార్ ట్యాగ్ నుంచి ప్రభాస్ లానే ఐకాన్ స్టార్ ట్యాగ్ కి పాన్ ఇండియా స్థాయిలో మారిపోయాడు.

మరి ఇప్పుడు ఈ సినిమా వసూళ్లపై ఒక తుది క్లారిటీ అయితే బయటికి వచ్చింది. మొదటి రోజే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం నేటితో 50 రోజుల థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి ఇపుడు ఈ 50 రోజులకి గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళ్లు రాబట్టిందో కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఈ 50 రోజులకి గాను ఈ చిత్రం మొత్తం 365 కోట్లు గ్రాస్ కొల్లగొట్టిందట. అంటే రోజుకి కోటి రూపాయలు లెక్కేసుకుంటే సరిగ్గా ఏడాది వసూళ్లు ఈ చిత్రం 50 రోజుల్లో అందుకొని రికార్డు హిట్ గా నిలిచింది. దీన్ని చిత్ర బృందం కూడా ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సమంతా ఒక స్టన్నింగ్ ఐటెం సాంగ్ లో కనిపించింది. అలాగే అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేసారు.