Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా చాలా సైలెంట్ గా ఉంటున్నారు అంతే కాకుండ ఈయన గత కొద్దిరోజులుగా మీడియా ముందుకు కూడా రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నారనే చర్చ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏ విషయం గురించి అయినా ప్రతిపక్షాలను నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు. తప్పు చేస్తే తమ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే వైఖరి పవన్ కళ్యాణ్ ది.
ఇలా తరచూ పాలనపై దృష్టి సారిస్తూ ప్రజా క్షేమమే ముఖ్యమని భావించే పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో అసలు ఏం జరుగుతుందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అందించలేము అంటూ ఒక్క మాటతో తేల్చేశారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కూడా హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తాము అంటూ మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇచ్చిన మాట పూర్తిగా తప్పారని తెలుస్తోంది.
ఇలా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అందించలేమని చెప్పడంతో మీడియా ముందుకు వచ్చిన ప్రజలలోకి వచ్చిన ఆయనకు సంక్షేమ పథకాల గురించి ప్రశ్నలు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే కాస్త ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోయే వరకు ప్రజలలోకి రాకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఈయన సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్న నేపథ్యంలో సైలెంట్ గా షూటింగ్ పనులను చేసుకుంటున్నారా అన్న సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
ఇలా తనకు సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే బిజెపి తరఫున ఢిల్లీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని అందుకే ఈ గ్యాప్ లో సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారని సమాచారం. ఇక మహారాష్ట్రలో ఎన్నికల జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ బిజెపి తరఫున ప్రచారం చేసి ఆ పార్టీ విజయానికి దోహదం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో జరగబోయే ఎన్నికలలో కూడా పవన్ కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం.