బాలకృష్ణ మైండ్ మారింది.. ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ

Fans Happy With Balakrishna'S Change Of Mind
నందమూరి బాలకృష్ణ ట్రెండ్ మార్చారు. సినిమాలను ఎంచుకునే విషయంలో పద్ధతిని ఛేంజ్ చేసుకున్నారు. ఒకప్పుడు బాలకృష్ణ కొత్త సినిమాను అనౌన్స్ చేస్తే ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి నిలబడుతుందో లేదో చెప్పేసేవారు అభిమానులు.  అందుకు కారణం ఆయన ఎంచుకునే దర్శకులే. ఒక దశలో 90ల దశకం ఫార్ములాను పట్టుకుని సినిమాలు చేసే దర్శకులతోనే బాలకృష్ణ సినిమాలు చేసేవారు. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యేవి. అభిమానులకే తలభారం పుట్టేది.  అల్లరి పిడుగు, ఒక్క మగాడు, పరమవీరచక్ర, మహారథి, మిత్రుడు, డిక్టేటర్, రూలర్ లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణలు.  
 
ఆకాశంలో ఉండే క్యారెక్టరైజేషన్లు, విపరీతమైన సన్నివేశాలు, లాజిక్స్ అందని ఫైట్స్, కళ్ళు తిరిగే మేకప్స్ ఇలా అన్నీ ఇబ్బందికరమైనవే ఉండేవి.  అవి చూసి చూసి ఒక దశలో అభిమానులే విసిగిపోయారు.  అలాంటి స్థితిలో ఉన్న బాలయ్య ఇప్పుడు పద్దతి మార్చారు.  దర్శకులను ఎంచుకునే తీరు మారడంతో ఆయన సినిమాలు కూడ చేంజ్ అయ్యాయి.  బోయపాటి శ్రీనును చూజ్ చేసుకుని వరుస హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు చేస్తున్న ‘అఖండ’ కూడ ఆయన దర్శకత్వంలోనే రూపొందుతోంది. దీని తర్వాత గోపిచంద్ మలినేని సారథ్యంలో ఒక సినిమా ఆతర్వాత అనిల్ రావిపూడి ఒక సినిమా చేయనున్నారు. బాలకృష్ణ ఇలా మూస దర్శకులను వదిలేసి ఈతరం దర్శకులతో సినిమాలు చేస్తుండటం అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఆయన సినిమాల మీద ఆసక్తి కలుగుతోంది.  అందుకే ఎన్నడూ లేనంతగా ఈమధ్య బాలకృష్ణ ప్రాజెక్ట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles