హీరోలు బాగానే వుంటారు.. హీరోల అభిమానులకే పైత్యం ముదిరి పాకాన పడుతోంది. పవన్ కళ్యాణ్ ఎలాగైతే నాలుగైదు సినిమాలతోనే అప్పట్లో యూత్ ఐకాన్‌గా పాపులారిటీ తెచ్చుకున్నారో, అలాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అనూహ్యమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు యువతలో.. అని నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించడం వివాదానికి కారణమయ్యింది.
దిల్ రాజు చెప్పడంలో తప్పేమీ లేదు. విజయ్ అనూహ్యమైన పాపులారిటీ అతి తక్కువ కాలంలో సంపాదించుకున్నాడు. నిజానికి తమ అభిమాన హీరోని పవన్ కళ్యాణ్‌తో పోల్చడాన్ని విజయ్ దేవరకొండ అభిమానులూ హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే, కొందరు దురభిమానులు మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ అటు విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య చిచ్చపెడుతున్నారు. వీరిలో ఇతర హీరోల అభిమానులే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఇంకేముంది.? ఈ వివాదం పక్కదారి పట్టేసి విజయ్ – పవన్ కళ్యాణ్ అభిమానుల పంచాయితీగా మారిపోయింది. ఇలాంటి గొడవల్లోకి హీరోలు తలదూర్చే అవకాశం లేదు. ‘మేమంతా కలిసే వున్నాం.. కలిసే వుంటాం..’ అని హీరోలు ఎన్నిసార్లు ప్రకటించినా, దురభిమానులు మాత్రం తమ దురభిమానాన్ని మానుకోవంలేదు.