మహేష్ సినిమా ఎలా ఉండబోతుందో నిర్మాతకి కూడ తెలియదట

False buzz on Rajamouli, Mahesh movie
 False buzz on Rajamouli, Mahesh movie
సూపర్ స్టార్ మహేష్ బాబు జాబితాలో ఉన్న దర్శకుల్లో ఎస్.ఎస్.రాజమౌళి పేరు కూడ ఉంది.  ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చేస్తున్న ఆయన అది పూర్తికాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.  అది పూర్తయ్యేనాటికి ఇంకో ఏడాది పడుతుంది.  ఈలోపు రాజమౌళి కూడ ‘ఆర్ఆర్ఆర్’ పూర్తిచేసి కాస్త రిలాక్స్ అవుతారు.  అలా ఇద్దరూ పూర్తిగా ఖాళీ అవ్వగానే వీరి సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేసే సినిమా అందునా మహేష్ బాబుతో మొదటిసారి చేస్తున్న సినిమా. కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చిత్రం మీద పుకార్లు కూడ మొదలయ్యాయి. 
 
ఈ చిత్రాన్ని రాజమౌళి ఇండియాలో కాకుండా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తీయనున్నారని టాక్ పుట్టుకొచ్చింది. అసలు ఇంతవరకు రాజమౌళి ఫారిన్ లోకేషన్లకు వెళ్ళిందే లేదు. ఎంటపెద్ద సినిమా అయినా ఇండియాలోనే. అది కూడ ఎక్కువగా హైదరాబాద్లోనే చూస్తారు. అలాంటిది తొలిసారి బయటి దేశానికి వెళ్తున్నారు అంటే ఎక్కడో డౌట్ కొట్టింది. నిర్మాత కెఎల్ నారాయణ స్పందిస్తూ అసలు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సినిమా అనేది ఒట్టి పుకారు మాత్రమేనని నిజానికి స్టోరీ లైన్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది అనేది తనకు కూడ ఖచ్చితంగా తెలియదని అన్నారు.