ఇది నా కాలే..ఇది నాకాలే అంటూ పుష్ప డైలాగులతో రెచ్చిపోయిన పైమా..ప్రోమో వైరల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ప్రతి వారం ప్రసారమవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కమెడియన్స్ అందరు తమదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పైమా ఎంతో హైలెట్ అయ్యారు.

జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి పైమా ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో పైమా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగ ఫైమా పుష్ప డైలాగులు చెబుతూ అదరగొట్టింది. పుష్ప సినిమాలో ఎంతో ఫేమస్ అయిన డైలాగ్ ఇది నాకాలే.. ఇది నాకాలే అనే డైలాగ్ ఎంతో క్రేజ్ దక్కించుకుంది.ఇక ఇదే డైలాగ్ పైమా వాడుతూ బుల్లెట్ భాస్కర్ టీమ్ లో రచ్చ చేశారు.

YouTube video player

ఇలా ఈ డైలాగులు చెబుతూ అందరిని ఓ రేంజ్ లో ఆడుతుంది. మొత్తానికి ఈ ప్రోమోలో పైమా తన కామెడీతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే శుక్రవారం వరకు వేచి చూడాలి. మరెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.