Fahadh Faasil: మాములుగా సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు మంచిగా ఫామ్ లో ఉన్న సమయంలోనే ఎక్కువ సినిమాలలో నటించిన నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ మాత్రం సినిమాలు మానేశాక పని చేయాలనుకుంటున్నారట. అవును యాక్టింగ్ కు గుడ్‌బై చెప్పిననాడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తానని గతంలో కూడా అన్నారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్ ఫాజిల్ మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు నన్ను చూసి బోర్ కొట్టినప్పుడు సినిమాలు మానేసి స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తాను. జనాలను వారి గమ్యస్థానాలకు చేర్చడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు. ఛాన్స్ వచ్చినప్పుడు కచ్చితంగా డ్రైవర్ గా మారిపోతాను. అప్పుడు నేను డ్రైవింగ్ చేయడంతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలను మరింత నిశితంగా పరిశీలించే అవకాశం దొరుకుతుంది.
వ్యక్తిత్వ వికాసానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. అలాగే ఫహద్ భార్య నజ్రియాతో కూడా ఎప్పుడూ ఇదే మాట చెప్తుంటాడు. రిటైర్‌మెంట్ తర్వాత బార్సిలోనాలో సెటిలైపోయి డ్రైవర్ గా పని చేస్తానని పలుమార్లు చెప్పాడట. అందుకు నజ్రియా కూడా సంతోషంగా ఒప్పుకుందట. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఫాజిల్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే సినిమా పుష్ప. ఈ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు ఫహాద్ ఫాజిల్. ఇందులో అద్భుతంగా నటించి పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.
Fahadh Faasil: సినిమాలు మానేస్తా.. అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తా.. నటుడు ఫహద్ ఫాజిల్!
