సప్రైజ్.. ‘పుష్ప’ను ఢీకొట్టబోయేది ఇతగాడే

Fahadh Faasil to compete with Allu Arjun in Pushpa

Fahadh Faasil to compete with Allu Arjun in Pushpa

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. బన్నీ కెరీర్లో ఇదే అత్యంత ఖరీదైన చిత్రం. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో బన్నీ స్మగ్లర్ పాత్రలో కనిపిస్తాడు. ఆయన పాత్రలోనూ అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇలా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ తెలిసినా కూడ కథలో ప్రతినాయకుడు ఎవరనేది తెలియలేదు.

సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉన్నా ఆ సంగతి తెలియకపోవడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. డైరెక్టర్ సుకుమార్ కావాలనే హైప్ పెంచడానికి ఆ కీలకమైన సంగతిని ఇన్నాళ్లు దాచిపెట్టి కొద్దిసేపటి క్రితమే రివీల్ చేశారు. నిజంగానే సప్రైజ్ ఇచ్చారు. కథలో బన్నీని ఢీకొట్టబోయేది ఎవరో కాదు ఫహాద్ ఫాజిల్. ఫహాద్ ఫాజిల్ మలయాళం ఇండస్ట్రీలో పెద్ద స్టార్. నేషనల్ అవార్డు విన్నర్. నటుడిగా మంచి పేరుంది. అలాంటి వ్యక్తి బన్నీకి ప్రత్యర్థి అంటే సినిమా లెవల్ పెరిగినట్టే. పోటాపోటీగా నటించే ఆ ఇద్దరినీ కలిపి ఒకే ఫ్రేమ్లో ఊహించుకుంటే సినిమా మీద ఆసక్తి రెట్టింపు అవుతోంది. మొత్తానికి సుకుమార్ తన సెలక్షన్ సూపర్ అనిపించుకున్నారు.