బీజేపీ నోటి దురుసు.. ఫలితాలను తారుమారు చేస్తాయా..?

telangana bjp

 గ్రేటర్ ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతూ ఎన్నికల సమరంలో దూసుకొని వెళ్తుంది. అనుకోని విధంగా దుబ్బాకలో విజయం సాధించటంతో ఆ పార్టీకి ఎక్కడ ఉత్సహం, ఊపు వచ్చాయి. అదే ఊపులో గ్రేటర్ లో ఎన్నికలకు సిద్దమైన బీజేపీకి ఇప్పుడు తమ నోటి దురుసే ప్రధాన సమస్య అవుతున్నట్లు తెలుస్తుంది.

raghunandan rao

దుబ్బాక హీరో..ఇప్పుడు జీరో అయ్యాడా..?

 దుబ్బాక లో బీజేపీ విజయం సాధించటం వెనుక అక్కడ పోటీచేసిన రఘునందన్ రావు హస్తం చాలా ఉంది. తనదైన మాటలతో తెరాస ను ఇరుగున పెట్టి, అక్కడ ప్రజల మనసులను గెలిచి విజయం సాధించి, తెలంగాణ బీజేపీలో హీరో అయ్యాడు. దీనితో అతన్ని గ్రేటర్ ఎన్నికల్లో ఉపయోగిచుకోవాలని భావించిన బీజేపీ అతనికి గ్రేటర్ లో కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైసీపీ కి టార్గెట్ అయ్యాడు. దీనితో వైసీపీ అభిమానులు అతనిపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ల్ చేయటమే కాకుండా, గ్రేటర్ పరిధిలోని వైసీపీ అభిమానులందరూ తెరాస కు ఓట్లు వేయాలని పెద్ద ఎత్తున క్యాంపైన్ కూడా రన్ చేస్తున్నారు, దీనితో తప్పు జరిగిందని గ్రహించి దిట్టుబాటు చర్యలు చేపట్టిన కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

bandi sanjay

సర్జికల్ స్ట్రెక్స్ … ఇదో సెల్ఫ్ గోల్

 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ పాతబస్తీ పై సర్జికల్ స్ట్రెక్స్ చేస్తామంటూ మరోసారి నోరు జారారు. ఈ వ్యవహారంతో హిందువుల ఓట్లు హోల్ సేల్ గా తమకి పడతాయని ఆయన భావించినా.. ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో మతకల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందన్న మాట మాత్రం వాస్తవం.  సర్జికల్ స్ట్రైక్స్ ని టీఆర్ఎస్ గట్టిగా తిప్పికొట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని ప్రశ్నిస్తూ.. టోటల్ గా బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఇరుకున పెట్టారు కేటీఆర్. పాతబస్తీ లో ఎంఐఎం మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయినాగానీ, బండి సంజయ్ సర్జికల్ స్ట్రెక్స్ అనే పదం ఉపయోగించటంతో పాతబస్తీ జనాలు మరోసారి ఎంఐఎం వైపు చూసే అవకాశం ఇచ్చినట్లు అయ్యింది.

జనసేన దెబ్బ గట్టిగా పడనుందా..?

 గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీచేయబోతుందంటూ నానా రచ్చ చేశారు పవన్ కళ్యాణ్ ఫాన్స్, 50 కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధం అయ్యాడు పవన్ కళ్యాణ్, అయితే ఉన్నఫళంగా ఎన్నికల నుండి తప్పుకొని బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఎలాంటి షరతులు లేకుండా బీజేపీ విజయానికి జనసైనికులు కృషి చేయాలనీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, అయితే జనసైనికులు మాత్రం అందుకు ఎంత వరకు సిద్ధంగా వున్నారు అనేది అనుమానం.. బీజేపీ వలనే తమకు పోటీచేసే అవకాశం లేకుండా పోయిందనే ఆవేదన జనసైనికుల్లో ఉందని, దాని మూలంగా బీజేపీకి ఎంత వరకు మద్దతు ఇస్తారో అనేది అనుమానం.

పైన చెప్పుకున్న అంశాలు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఖచ్చితంగా తారుమారు చేసే అవకాశం లేకపోలేదు