అధికారపక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్యన వాతావరణం వేడెక్కింది. ఒకరిమీద ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఇరు పార్టీల కీలక నేతలు మాటల యుద్దానికి దిగడంతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు, కొందరు టీడీపీ నేతల పేర్లు చెబితే మంత్రి కొడాలి నానికి టెంపర్ లెచిపోతుంది. ఆవేశం అణచుకోలేక ఒక్కోసారి తిట్టేస్తుంటారు కూడ. ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీదనే ద్రుష్టి పెట్టిన అయన ఈమధ్య టీడీపీ కీలక నేత దేవినేని ఉమ మీద ఫైర్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు నేతలు వేరు వేరు మీడియా సమావేశాలు నిర్వహించి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. వ్యవహారం వ్యక్తిగత విషయాల వరకు వెళ్లింది.
డ్రైవర్, క్లీనర్, సోడాల వ్యాపారం అంటూ ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. గత వారం రోజులుగా వీరి తగవు నడుస్తూనే ఉంది. ఒకానొక దశలో కొడాలి నాని దేవినేని ఉమను ఉద్దేశించి మాట్లాడుతూ డ్రైవర్లు, క్లీనర్లు అంటూ మాట్లాడటం మానుకోవాలి. నాకు బస్సులు, లారీలు ఉన్నాయి. ఎక్కడో ఒక చోట లారీ ఎక్కితే అప్పడం అయిపోతావ్ అంటూ మాట్లాడారు. ఈ వాఖ్యలు వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. కొడాలి నాని మాటలకి కౌంటర్ ఇవ్వాలనుకున్న ఉమ ఈసారి మాటలతో కాకుండా చేతలతో చూపించాలని నిర్ణయించుకుని నాని మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాధు చేశారు. తనను లారీతో గుద్ది చంపుతానని కొడాలి నాని బెదిరిస్తున్నాడని పోలీసులకు పిర్యాధు చేశారు.
ఈ బెదిరింపుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భాగస్వామ్యం కూడ ఉందని పిర్యాధులో పేర్కొన్నారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, వంశీలతో కలిసి బెదిరిస్తున్నారని పిర్యాధు చేసి ఇక మంత్రి ఇలా బెదిరించడం ఏమిటి, ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరిద్దరి పరస్పర మాటల దాడులు, ఉమ పోలీస్ పిర్యాధు తతంగాలను చూస్తున్న జనం చూడబోతే ఇద్దరూ త్వరలోనే కోర్టు బోనులో ఎదురెదురు నిలబడతారెమో అంటూ ఒకింత ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇలా మీద పిర్యాధులు పడుతున్నా కొడాలి నాని మాత్రం చంద్రబాబు నాయుడును ఎప్పటికీ తిడుతూనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చి సంచలనం రేపారు.