Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కుటుంబాన్ని మాత్రమే బంగారు నయం చేసుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని తెలిపారు ప్రభుత్వం వచ్చిన పది నెలలకే తీవ్రస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది అని తెలిపారు.
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీటింగ్ పెడితే జనాలు మధ్యలోనే వెళ్లిపోతున్నారని రోజా తెలిపారు.ఇక, పవన్ కల్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నారో అర్ధం కావటం లేదు అని ఎద్దేవా చేశారు. మొన్న వీళ్ల వెకిలి డ్యాన్సులకు పడిపడి నవ్వారు.. తిరుమలలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఈ సనాతన యోధుడు ప్రశ్నించటం లేదు.. తిరుమలలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించే బాధ్యత లేదా అంటూ పవన్ పై విమర్శలు కురిపించారు.
పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి భయపడి చివరికి ఇఫ్తార్ విందులకు కూడా హాజరు కావడం లేదని తెలిపారు.వైసీపీలో గట్టిగా మాట్లాడే వారిని టార్గెట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. నన్ను పేర్ని నాని అంబంటి రాంబాబు కొడాలి నాని వంటి వారందరిపై కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించి సంబరాలు చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు.
మమ్మల్ని అరెస్టు చేసిన మాకేం భయం లేదని రోజా మాట్లాడారు. మాపై ఎలాంటి అవినీతి లేదంటూ స్వయంగా కూటమినేతలే శాసనమండలిలోనూ శాసన సభలో తెలిపారు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని వెల్లడించారు. ఆడుదాం ఆంధ్రాలో నన్ను ఇరికించి అరెస్టు చేయాలని తెగ ఆరాటపడ్డారు కానీ ఈ ఆడదాం ఆంధ్రాలో ఎలాంటి అవినీతి జరగలేదని స్వయంగా కూటమినేతలే శాసనసభలోను శాసనమండలిలోనూ చెప్పారు..
ఇలా లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ ఎవరు పట్టించుకోలేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత సొంత జిల్లాలలో గంజాయి విరివిగా చేతులు మారుతున్నాయి.అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శలు చేశారు. ఇక సంక్షేమ పథకాలు కూడా అమలు కాలేకపోతున్నాయని మీకు పాలన చేతకాకపోతే వెంటనే దిగిపోండి అంటూ రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.