Balakrishna: వేలకోట్ల ఆస్తులు ఉన్న నెరవేరని బాలయ్య కోరిక.. అప్పుడైనా తీరుతుందా?

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య త్వరలోనే అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది బాలయ్య సినిమా రంగంలో, వ్యాపారాలలోను అలాగే రాజకీయాలలో కొనసాగుతూ వేల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించారు. ఇలా వేల కోట్ల ఆస్తులున్న బాలయ్యకు ఒక చిన్న కోరిక మాత్రం నెరవేరలేదని తెలుస్తుంది. మరి బాలయ్యకు నెరవేరని ఆ కోరిక ఏంటనే విషయానికి వస్తే…

బాలయ్యకు బ్రాహ్మణి, తేజస్విని ఇద్దరు కుమారులు అలాగే మోక్షజ్ఞ అనే కుమారుడు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే బాలకృష్ణ తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. ఇక వారిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించిన విషయం తెలిసిందే అయితే బాలయ్య ఎప్పుడు కూడా ఒక మనవరాలు ఉండాలని కోరుకున్నారట కానీ తన ఇద్దరి కూతుర్లకు కొడుకుల పుట్టడంతో ఇప్పటికే ఆ కోరిక నెరవేరలేదని తెలుస్తోంది. ఇక బాలయ్య కోరిక నెరవేరాలి అంటే తన కుమారుడు మోక్షజ్ఞ కైనా ఒక కూతురు పుడితే తన కోరిక నెరవేరుతోదని చెప్పాలి. ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నా..ఓ అమ్మాయి లేకపోతే ఆ ఇంటికి కల ఉండదు. ఇంట్లో అమ్మాయి మహాలక్ష్మిలా తిరుగుతూ ఉండాలన్నదే బాలయ్య కోరిక అందుకే తన కొడుకు కైనా కూతుర్లు పుడితే బాలయ్య కోరిక నెరవేరుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక మోక్షజ్ఞ మాత్రం సినిమాలలోకి వస్తారని ఊరిస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఆయన సినిమాల గురించి కనీసం ప్రకటన లేకపోవడంతో అభిమానులు మోక్షజ్ఞ పై ఆశలన్నీ వదులుకున్నారు.