ఇద్దరు సెన్సేషనల్ మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ సినిమాని అనౌన్స్ చెయ్యడంతో పాన్ ఇండియన్ లెవెల్ బాక్సాఫీస్ కి మరోసారి మూడినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి నిన్ననే ఈ భారీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేసేసారు.
వచ్చే జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే పాన్ ఇండియా సినిమా అంటే ఒక్క తెలుగు హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఓ రేంజ్ లో చూడాలి. అలా ఇప్పుడు వరకు బాహుబలి సిరీస్ కేజీయఫ్ లను మన సౌత్ నుంచి ఆదరించారు.
కానీ ‘RRR’ సినిమాకి ఓ మార్కెట్ లో డౌట్ నే అనిపిస్తుంది. అదే కోలీవుడ్ లో..ఈసారి సంక్రాంతి రేస్ లో తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా వారి స్టార్ హీరోల మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఉన్నాయి. మరి వాటి రిలీజ్ డేట్ లు బట్టే అక్కడ రాజమౌళి సినిమా ప్రభావం ఎలా ఉంటుంది అనేది కన్ఫర్మ్ అవుతుంది.