‎Shwetha Menon: సినిమాల్లో అసభ్యకర కంటెంట్..నటి శ్వేతా మీనన్‌పై కేసు నమోదు!

Shwetha Menon: అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ ఉన్న సినిమాలలో తన రోల్ తో ఆర్థిక లాభాలు అంర్జించినందుకు గాను కేరళలోని ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు నటి శ్వేతా మీనన్‌పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 67A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఎర్నాకులం స్థానికుడైన మార్టిన్ మెనాచేరి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పోలీసులకు ఈ ఆదేశాలను జారీ చేసిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. పోలీసులు ఎఫ్ఐఆర్‌ లో అనైతిక ట్రాఫిక్ చట్టంలోని 5, 3 సెక్షన్లను కూడా చేర్చారట.

‎ఆర్థికపరమైన లాభాల కోసం అశ్లీల అసభ్యకరమైన కంటెంట్ ఉన్న సినిమాల్లో పాత్రలు పోషించారని ఎఫ్ఐఆర్ లో వారు ఆరోపించారు. ఆ కంటెంట్‌ ప్రజాదరణ పొందేందుకు సోషల్ మీడియా, అడల్ట్ సైట్‌ ల ద్వారా ప్రసారం చేశారని, సంపాదన కోసం అలాంటి కంటెంట్‌ను వాణిజ్యపరంగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అయితే యాక్టర్ శ్వేతా మీనన్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంచి పని చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.