చిన్న సినిమాకి ప్రభాస్, రామ్ చరణ్ పెద్ద సపోర్ట్

Ek Mini Katha gets support from Prabhas, Ram Charan
Ek Mini Katha gets support from Prabhas, Ram Charan
సినిమా చిన్నదే అయినా ప్రమోషన్స్ పెద్దగా ఉంటే గట్టెక్కినట్టే. ఈరోజుల్లో అదే సక్సెస్ ఫార్ములా.  ప్రమోషన్లు పెద్దగా ఉండలాంటే పెద్ద తలలు రంగంలోకి దిగాల్సిందే.  అదే పని చేస్తున్నారు ‘ఏక్ మినీ కథ’ టీమ్.  సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చట్టాన్ని యువీ క్రియేషన్స్ నిర్మించింది.  యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ హోమ్ బ్యానర్.  పైగా సంతోష్ శోభన్ తండ్రి శోభన్ ప్రభాస్ కు ‘వర్షం’ లాంటి గ్రాండ్ హిట్ ఇచ్చారు.  ఈ కారణాల రీత్యా ఈ చిన్న చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ప్రభాస్ ముందుకొచ్చారు.  డైరెక్టర్ శోభన్ తనకిచ్చిన అమూల్యమైన విజయాన్ని గుర్తు చేసుకుంటూ సంతోష్ శోభన్ సినిమాను ప్రమోట్ చేశారు. 
 
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడ ఈ చిన్న చిత్రాన్ని ప్రమోట్ చేశారు.  సినిమా ట్రైలర్ చూశానని, ఆసక్తికరంగా ఉందని అన్నారు.  ఇలా ఇద్దరు పెద్ద హీరోలు సపోర్ట్ చేయడంతో వారి అభిమానులు సైతం సినిమా పట్ల పాజిటీవీని చూపిస్తున్నారు.  త్వరలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది ఈ చిత్రం.  ప్రీరిలీజ్ బిజినెస్ కూడ బాగానే జరిగింది.  4.3 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఓటీటీ హక్కుల ద్వారా 9.3 కోట్లు, శాటిలైట్ హక్కుల ద్వారా 3.8 కోట్లు రాబట్టింది నిర్మాతలకు మంచి టేబుల్ ప్రాఫిట్స్ చూపించింది.