ఈ చిన్న హీరోయిన్ ఆ పెద్ద ఆ దర్శకుడికి నో చెప్పిందట

Eesha Rebba
Eesha Rebba
Eesha Rebba

టాలీవుడ్ పరిశ్రమలో తెలుగు అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. ఉన్నది ఏ ఇద్దరో ముగ్గురో. వారిలో కాస్తో కూస్తో ఫేమ్ ఉన్న హీరోయిన్ ఈషా రెబ్బ. కెరీర్ మొదట్లో ఇబ్బందులుపడినా ప్రేక్షకులు ఆమె మీద చూపిస్తున్న అభిమానం ఆమెను నిలబెటట్టింది. నిర్మాతలు కూడ మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమెకు ఆఫర్లు ఇస్తూ వచ్చారు. ‘అరవిందసమేత’ లాంటి సినిమాలో మంచి పాత్రే దొరికింది ఆమెకు. అయితే సోలో హీరోయిన్ గా మాత్రం బ్రేక్ దొరకలేదు. అయినా ఈషా మాత్రం తగ్గట్లేదు.

రెమ్యునరేషన్ విషయంలో మొహమాటం లేకుండా వెళ్తోందట ఆమె. ఇటీవలే ఆమెకు సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ నుండి ఆఫర్ వచ్చిందట. గుణశేఖర్ సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ సినిమాను మంచి బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. సినిమా మంచి ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటీనటులు అయినా వదులుకోరు. కానీ ఈషా రెబ్బ మాత్రం నో చెప్పేసిందట. ఎందుకంటే ఆమెకు పారితోషకం తక్కువ ఇస్తామన్నారట. అందుకే ఆమె నిర్మొహమాటంగా సినిమాను రిజెక్ట్ చేసిందట. మొత్తానికి తెలుగమ్మాయి రెమ్యునరేషన్ విషయంలో గట్టిగానే ఉందన్నమాట.