Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు.సాయి సూర్య డెవలపర్స్ కేసులో భాగంగా ఈడి అధికారులు మహేష్ బాబుకి నోటీసులు అందజేస్తూ విచారణకు హాజరుకావాలని కోరారు అయితే గత నెల ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావలసిందిగా మొదట నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు షూటింగ్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని తనకు కాస్త సమయం ఇవ్వాలని మహేష్ బాబు ఈడీ అధికారులను కోరారు.
ఈ క్రమంలోనే అధికారులు మహేష్ బాబుకి తగిన సమయం ఇచ్చారు. అయితే సోమవారం(మే 12న) ఈయన విచారణకు హాజరు కావాలి అంటూ మరోసారి నోటీసులు అందజేశారు. మరి నేడు అయిన మహేష్ బాబు అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందుకు రెమ్యూనరేషన్ రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ రూపంలో తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఏప్రిల్ 16న హైదరాబాదులో సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాలలో భాగంగా భారీ ఎత్తున నగదు లభించింది.సాయిసూర్య డెవలపర్స్‌కు చెందిన సతీశ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టి నాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీశ్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకే ఈడి అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది అయితే సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నేపథ్యంలో ఆయనని కూడా విచారణకు రావాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు విచారణకు వెళ్లలేదు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.