OG Movie: పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు.. ఓజీ మూవీ అప్డేట్ పై డీవీవీ మూవీస్ కీలక వాఖ్యలు!

OG Movie: సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజీ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఇకపోతే ఈ సినిమా నుంచి అప్డేట్స్ సరిగ్గా రాకపోవడంతో గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులు గోల గోల చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా ఎక్కడికి వెళ్లినా కూడా ఓజీ, ఓజీ అని గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు.

ఇలా మొన్న ఒక గిరిజన ప్రాంతం కు వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే చేయడంతో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ అయిన విషయం తెలిసిందే. మీరు అలా అరిస్తే నా పని నేను చేసుకోలేను అంటూ కాస్త సీరియస్ అయ్యాడు. తాజాగా మరోసారి అలాంటి సీన్ రిపీట్ అయింది. క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఉన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో కొంద‌రు ఫ్యాన్స్‌ ఓజీ.. ఓజీ.. అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది ఈ ఘటనపై డీవీవీ మూవీస్‌ రియాక్ట్ అవుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఈ విధంగా రాసుకొచ్చింది. ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న అభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓజీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాము. కానీ ఫ్యాన్స్‌ కొందరు పవన్ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు.. సమయం, సందర్భం లేకుండా ఓజీ.. ఓజీ అని అరవడం, ఆయనను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని అని తెలిపారు.

పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు. ఆయన స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన బాధ్యత. ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాము 2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వారికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆయన గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ తో పాటు శ్రియారెడ్డి, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి మరి.