ఏ మాయ చేశావే చిత్రంతో తెలగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న క్యూట్ బేబి సమంత. నాగచైతన్యని వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్మడు రూటే మారింది. కేవలం సినిమాలు చేయడమే కాక పలు బిజినెస్‌లు చేస్తుంది. సేంద్రీయ వ్యవసాయం కొనసాగిస్తుంది. అలానే డిజిటల్ ప్లాట్‌ఫాంలపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం కోసం వ్యాఖ్యాతగాను మారుతుందనే టాక్స్ వినిపిస్తున్నాయి.
బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, ఆయన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇటీవల మనాలి వెళ్ళారు. దీంతో దసరా స్పెషల్ ఎపిసోడ్‌ని సమంత హోస్ట్ చేయాల్సి వచ్చింది. మామ ఇచ్చిన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించిన ఈ అమ్మడు ప్రతి ఒక్కరిచే ప్రశంసలు అందుకుంది. తెలుగుపై అంత పట్టు లేకపోయిన టైమింగ్ విషయంలో ఎక్కడ తేడా రాకుండా సూపర్భగా మేనేజ్ చేసింది. మూడు గంటల పాటు సాగిన ఈ షోకు సంబంధించి అందరు అనుకున్నట్టుగానే 11.4 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వచ్చాయి.
నటిగానే కాదు వ్యాఖ్యాతగాను సమంత మామకు తగ్గ కోడలు అనిపించుకుంది. తాజా టీఆర్పీలని చూసిన ఆమె అభిమానులు రానున్న రోజులలో పలు షోస్‌కు వ్యాఖ్యాతగాను వ్యవహరించాలని కోరుతున్నారు. మరి అభిమానుల కోరికలను సమంత తీరుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కరోనా వలన సినిమా షూటింగ్స్‌కు చాలా దూరంగా ఉంటున్న సమంత యాడ్స్, పలు షోస్‌తో మాత్రం బిజీగా మారింది.