Kurup Movie: ఓటీటీ లలో విడుదల కానున్న దుల్కర్ సూపర్ హిట్ మూవీ

Kurup Movie: కరోనా మహమ్మారి వలన తీవ్రంగా నష్టమైన రంగాలలో సినీ రంగం ఒకటి. లాక్ డౌన్ వలన సినిమా థియేటర్లు అన్ని మూతపడడం వలన సినీ పరిశ్రమ చాలా తీవ్రంగా నష్టపోయింది. అయితే ఇలాంటి సమయం లోనే ఓటిటి డిజిటల్ రంగం దూసుకొచ్చింది. కరోనా కారణంగా ఓటిటి ప్లాట్ఫారమ్స్ కి మంచి డిమాండ్ పెరగడం వలన చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకూ ఇందులోనే విడుదల అవుతుంది. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో భారీ సినిమా వచ్చి చేరింది.

థియేటర్ల ద్వారా మునుపటి రేంజ్ లో వసూళ్లు రావడం లేనందున ఎంతటి పెద్ద సినిమా అయినా.. ఎంత పెద్ద హిట్టు సాధించినా ఓటీటీ లలో స్ట్రీమింగ్ అవ్వాల్సిందే. దాని తర్వాత శాటిలైట్ ద్వారా టెలికాస్ట్ అవ్వాల్సిందే. తాజాగా సూపర్ హిట్ మలయాళ మూవీ కురుప్ ఓటీటీ లల్లోకి విడుదల అయ్యేందుకు సర్వం సిద్ధమయ్యింది.

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన కురుప్ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్టుగా నిలిచింది. మహానటి సినిమా ద్వారా దుల్కర్ కు తెలుగు లో మంచి క్రేజ్ దక్కింది. అందుకే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి మంచి విజయాన్ని సంపాదించేటట్లు చేసారు.

అయితే డిసెంబర్ 17న నుండి డిజిటల్ ప్లాట్ఫారం దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లోనే కురుప్ అందుబాటులో ఉంటుందని సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో జనాలు చూస్తారా అనేది మరి చూడాలి.