దుల్కర్ సల్మాన్ ఇంటి ఖరీదే 100 కోట్లా… ఆయన ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడుగా అందరికీ పరిచయమయ్యారు నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ఈయన నటించిన సీతారామం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం ఎంతో మంచి విజయాన్ని అందుకొని దూసుకుపోతుంది. చిన్నప్పటినుంచి ఒక సూపర్ స్టార్ కొడుకు అనే భావన కాకుండా ఒక సాధారణ కుర్రాడిలా పెరిగిన ఈయనకు సినిమాలలోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదు.

తండ్రి బలవంతంతో ఆరు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్న అనంతరం ఈయన ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తన రెండవ సినిమాకే ఫిలింఫేర్ అవార్డు అందుకోవడంతో సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన వివాహం అయిన అనంతరం ఇండస్ట్రీలోకి వచ్చారు. ఒకప్పుడు సినిమాకు 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోగా ప్రస్తుతం ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఇక ఈయన నివసిస్తున్న ఇల్లు 100 కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది. అలాగే ఈయన దగ్గర సుమారు 20 కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈయన ఒక్కో యాడ్ చేసినందుకు సుమారు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. మొత్తానికి సినిమాలు వరుస యాడ్లతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయన ఆస్తి 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా దుల్కర్ సల్మాన్ ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.