దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ ఆగస్టు 5న విడుదల

Dulquer Salmaan

Dulquer Salmaan  : వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ప్రమోషనల్ కంటెంట్‌ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తేదిని తాజాగా నిర్మాతలు ఖరారు చేశారు. ఆగస్టు 5న ‘సీతా రామం’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.

మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగల్ ‘ఓ సీతా- హే రామా’ పాటకు మంచి ఆదరణ లభించింది. సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటిటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ చార్ట్ బస్టర్ గా నిలిచి ఆల్బమ్ మరిన్ని అంచనాలు పెంచింది.

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అడిషనల్ సినిమాటోగ్రఫీని శ్రేయాస్ కృష్ణ అందిస్తున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్ కుమార్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు