భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు.. ఈ పిచ్చి తగ్గదంటూ కామెంట్స్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన ఇది వరకు ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు కార్తీకదీపం సీరియల్ ద్వారా వచ్చిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు దూరం అయినటువంటి ఈయన తన భార్య మంజులతో కలిసి మంజుల నిరుపమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఇకపోతే తాజాగా డాక్టర్ బాబు తన భార్య షాపింగ్ కోసం వెళ్లారు. సత్యనారాయణ వ్రతం ఉందంటూ ఆమె నగలు షాపింగ్ చేయడానికి వెళ్లి ఏకంగా అక్కడ తన భర్తతో ఏడువారాల నగలను కొనేలా చేసింది. అయితే అవి పూర్తి బంగారంతో కాకుండా 92.5 స్వచ్ఛమైన వెండి పై బంగారు పూత పూసిన నగలను కొనుగోలు చేసింది. ఇలా ఏకంగా ఏడు వారాల నగలను తన భర్త చేత కొనేలా చేయించడంతో డాక్టర్ బాబు షాక్ అవ్వడమే కాకుండా అమ్మాయిలకు షాపింగ్ అంటే ఎంతో పిచ్చి ఉంటుందని ఆ పిచ్చి ఎప్పటికి తగ్గదు అంటూ కామెంట్ చేశారు.

ఈ విధంగా వీరి నగలు కొనుగోలు చేయడానికి సంబంధించిన వీడియోని యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక కార్తీక దీపం రీ ఎంట్రీ గురించి ఆయన మాట్లాడుతూ తిరిగి ఈ సీరియల్లో కి తాను రానని చెప్పేశారు. ఇక ప్రస్తుతం ఎలాంటి సీరియల్స్ చేయకుండా సీరియల్స్ ను నిర్మిస్తూ బిజీగా మారనున్నారు. అదేవిధంగా డాక్టర్ బాబు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారని, త్వరలోనే ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటానని తెలిపారు.