ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఇందులో దగ్గుబాటి రానా ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఈ రీమేక్ మీద ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇందులో పవన్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇదొక సీరియస్ డ్రామా. ఇలాంటి సినిమాను గతంలో పవన్ ఎన్నడూ చేయలేదు. అందుకే అందరిలోనూ అంత ఆసక్తి. చాలా తక్కువ టైమ్ పెట్టుకుని ఈ సినిమాను మొదలుపెట్టారు టీమ్. కానీ లాక్ డౌన్ మూలంగా ఆలస్యం అయింది. పవన్ ఇతర కమిట్మెంట్స్ మూలంగా ఆ ఆలస్యం ఇంకా పెరిగింది.
దీంతో సినిమాకు పనిచేస్తున్న సినిమాటోగ్రఫర్ ప్రసాద్ మూరెళ్ల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట. గతంలో ఆయన ఇతర సినిమాలకి కమిట్ అవ్వడం మూలంగానే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే ఆయన ఇతర సినిమాల కోసం తప్పుకున్నారా లేకపోతే వేరే ఏదైనా కారణం చేత సపరేట్ అయ్యారా అనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారు నిర్మాతలు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, కథనం అందిస్తున్నారు.