జీవితంలో భార్య, పిల్లలని తప్పా ఎవ్వరినీ నమ్మొద్దు.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్!

Bandla Ganesh : ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన బండ్లగణేష్ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఈయన ఇలా సినిమాలతోనే కాకుండా రాజకీయాలలో కూడా కొంతకాలం సందడి చేశాడు. అయితే రాజకీయాలు బెడిసికొట్టడంతో ఈ మధ్య కాలంలో రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు. బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా కన్నా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా బాగా పాపులర్ అయ్యాడు. చేతికి మైక్ దొరికితే చాలు పవన్ కళ్యాణ్ భజన మొదలు పెడతాడు . ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ జపం చేస్తూ పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ చెప్పుకుంటాడు.

బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు. సోషల్ మీడియాలో ఈయన షేర్ చేసే పోస్టులు నిమిషాలలో వైరల్ గా మారుతుంటాయి. ఇటీవల బండ్లగణేష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. జీవితంలో తల్లి తండ్రులని, భార్య, పిల్లల్ని తప్ప ఎవ్వరినీ నమ్మొద్దు అంటూ బండ్ల గణేష్ హితవు పలికాడు. బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ నిమిషాలలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రంగంలోకి దిగి రకరకాలుగా కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ..బాగానే చెప్పావ్ బండ్లన్నా.. మరి మీ అభిమాన హీరో సంగతి ఏంటి? అంటూ పవన్ కళ్యాణ్ టాపిక్ తీసి తమ ప్రశ్నలతో రచ్చ చేస్తున్నారు. దేవుడిగా కొలిచిన పవన్ కళ్యాణ్ ఈ భక్తుడికి ఏం అన్యాయం చేశాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎవరి పేరు ప్రస్తావించకుండా బండ్ల గణేష్ కామెంట్ చేయటంతో అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ ఇటీవల డేగలా బాబ్జి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఇలా ఒకవైపు సినిమాలు, మరొకవైపు వ్యాపారాలలో బండ్ల గణేశ్ బిజిగా ఉన్నాడు.