శర్వానంద్ ఈ సినిమాని మాత్రం ఇప్పుడు మిస్ కాకండి.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన బెస్ట్ కంటెంట్ సినిమాలు అలాగే వరస్ట్ సినిమాలు కూడా గతంలో ఎప్పుడూ రాలేదని చెప్పాలి. మరి ఈ బెస్ట్ క్యాటగిరిలో వచ్చిన చిత్రాల్లో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం “ఒకే ఒక జీవితం” కూడా ఒకటి.

యువ దర్శకుడు కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర తక్కువగా టచ్ చేసిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే దీనికి మించి ఈ సినిమా ఎందుకు చూసి ఎంజాయ్ చెయ్యాలంటే సైన్స్ ఫిక్షన్ తో పాటుగా సినిమాలో కనిపించే అమ్మ సెంటిమెంట్ ప్రతి ఒక్కరిని ఎంతగానో కదిలిస్తుంది.

అందుకే ఈ చిత్రం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చూసి ఆనందించవచ్చు. మరి ఈ సినిమాలో చాలా కాలం తర్వాత అక్కినేని అమల నటించగా ఆమెపై సినిమా మరింత ఎమోషనల్ గా సాగుతుంది. దీనితో శర్వానంద్ అయితే తన కెరీర్ లో మంచి కం బ్యాక్ కూడా దీనితోనే అందించాడు.

మరి ముందు థియేటర్స్ లో చూడని వారు అయితే డెఫినెట్ గా ఈ సినిమాని ఇప్పుడు చూసే ఛాన్స్ వచ్చింది. ఈరోజు అక్టోబర్ 20 నుంచి డిజిటల్ గా సోని లివ్ నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. మరి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ కావాలి అనుకునే సినీ ప్రేమికులు తప్పకుండ ఇప్పుడు ఈ సినిమా చూడవచ్చు.