పాలు కాచడం అనేది ప్రతిరోజు మన వంటింట్లో జరిగే పని. పాలు కాచడం పెద్ద పనేమీ కాదు, గిన్నెలో పోసి మంట పెడితే అవే కాగుతాయి. కానీ ఒక్కోసారి స్టవ్ మీద పాలు పొంగి పోతుంటాయి. దానికి కారణం పాలు ఇప్పుడే పొంగు రావు కదా అని వేరే ఏదో ఒక పని చేసుకోవటం వల్ల అవి పొంగిపోతూ ఉంటాయి. ఇది తరచుగా అందరి ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం స్టవ్ మీద పాలు పొంగి పోకుండా ఉండడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
ప్రతి రోజు ఇంట్లో ఉదయం, సాయంత్రం పాలు కాచే సమయంలో పాలను ఒక పెద్ద గిన్నెలో పోసి మంటని సిమ్ లో పెట్టడం వల్ల పాలు పొంగి పోకుండా గిన్నెలోనే ఉడుకుతూ ఉంటాయి. ఇది చాలా మందికి తెలిసిన విషయమే, కాకపోతే ఇది సమయం ఎక్కువగా తీసుకోవటం వల్ల గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది.
*ఇప్పుడు మన రెండవ చిట్కా గురించి తెలుసుకుందాం. పాలని గిన్నెలో పోసి వేడి చేసే సమయంలో గిన్నె పైన అంచుకు వంట నూనె లేదా నెయ్యి పూయటం వల్ల పాలు పొంగు రాకుండా ఉంటాయి.
*అలాగే పాలు వేడి చేసే సమయంలో పాలలో ఒక ఐస్ క్యూబ్ వేయటం వల్ల పాలు తొందరగా పొంగు రావు.
*పాలు వేడి చేసే సమయంలో పాలు కాచే గిన్నెపై అడ్డంగా లేదా నిలువుగా ఒక చెక్క గేరేట ఉంచడం వల్ల పాలు పొంగు వచ్చినపుడు దానిపై పొర తగిలి చెక్క గెరేట ఆవిరి పీల్చుకోవటం వల్ల పాలు పొంగకుండా ఉంటాయి. అంతేకాకుండా చెక్క గేరేట వేడిని త్వరగా తీసుకుంటుంది.