మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

మోహన్ బాబు వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మనోజ్ మొదటి సినిమా నుండే మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డినా కూడా, స్టార్ హీరో కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా కూడా ఇండ‌స్ట్రీలో రాణించ‌డానికి తంటాలు ప‌డుతున్నాడు. అలాగే  మ‌నోజ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఉన్న ఇబ్బుందులు కూడా అత‌డిని వెన‌క్కినెట్టేసేలా చేశాయి.

మనోజ్ ప్ర‌ణ‌తి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్ర‌ణ‌తి రెడ్డి మ‌నోజ్ వ‌దిన విరోనిక‌కు ద‌గ్గ‌రి బంధువు మ‌రియు స్నేహితురాలు కూడా. పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌నోజ్ ప్ర‌ణ‌తి పెళ్లి చేసుకున్నారు.

కానీ కొన్నాళ్లకే  మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల త‌రవాత మ‌నోజ్ రెండో పెళ్లికి రెడీ అవ్వ‌గా మొద‌టి భార్య ప్ర‌ణ‌తి రెడ్డి ఎలా ఉంది ప్ర‌స్తుతం ఏం చేస్తుంది అని నెటిజ‌న్లు తెగ‌వెతికేస్తున్నారు. విడాకుల త‌ర‌వాత ప్ర‌ణ‌తి రెడ్డి అమెరికాకు వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌ణతి ఇల్యూస్ట్రేష‌న్ ఆర్టిస్ట్ కాగా అమెరికాలో సింగిల్ గానే ఉంటున్న‌ట్టు స‌మాచారం.  రీసెంట్ గా మనోజ్ భూమా మౌనిక తో ప్రేమలో ఉన్నట్టు, వీళ్ళు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి, అయితే దీనిపైన మనోజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.