కృష్ణ రెండో పెళ్లి తర్వాత మహేష్ బాబు తల్లి  ఏం చేశారో తెలుసా?

సూపర్ స్టార్  కృష్ణ  ఇంట్లో ఈ మధ్య కాలంలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం తన పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించాడు.  తాజాగా ఈ  కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు.

ఇందిరాదేవి గురించి చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి. కృష్ణ కి వరుసకు బంధువు అయిన ఇందిరా దేవి తో 1965లో వివాహం జరిగింది. సూపర్‌ స్టార్‌ కృష్ణతో ఇందిరా దేవికి వివాహం జరిగిన తర్వాత వీళ్ల వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే ఈ జంటకు రమేశ్‌బాబు, పద్మావతి జన్మించారు.

అయితే కొన్నాళ్ల తర్వాత కృష్ణ, విజయ నిర్మల తో ప్రేమలో పడి 1969లో ఆమెను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. అప్పటికే విజయనిర్మల తన భర్త నుండి విడిపోయారు. తనకి నరేష్ కూడా పుట్టాడు.

విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ విషయాన్ని నేరుగా తన భార్య ఇందిరాదేవికి చెప్పారట. మొదట్లో దీనిపై చాలా బాధపడిన ఆమె.. ఆ తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తేల్చి చెప్పేశారని తెలిసింది. ఇక, రెండో పెళ్లి అయినా భర్తతోనే కలిసి ఉంటానని సూటిగా చెప్పారట.

అయితే పెళ్లి తర్వాత మాత్రం కృష్ణ అప్పుడప్పుడు ఇందిరా దేవిని కలిసినా ఎక్కువ సమయం విజయ నిర్మల తోనే  గడిపేవారంట. విజయ నిర్మల మరణం తర్వాత కూడా కృష్ణ ఫార్మ్ హౌస్ ఉంటున్నారు కానీ ఇందిరా దేవి గారి దగ్గరికి రాలేదు. ఆవిడ తన కూతుళ్ళ దగ్గరే ఉండేది. ఇప్పుడు ఇందిరా మరణంతో కృష్ణ విషాదంలో మునిగిపోయారు.