మెగా వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఆయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. అయితే ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే రామ్ చరణ్ ఫిట్ నెస్ సీక్రెట్, ఆయన ఫుడ్ డైట్ ఏంటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కుతూహలం ఉంటుంది. మరి అతని ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
రామ్ చరణ్ షూటింగ్ ఉన్న సమయంలో తప్పనిసరిగా ఇంటి నుంచి తయారుచేసిన భోజనాన్ని తీసుకువెళ్తారు. పొరపాటున కూడా బయట తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోరట.ఇలా రామ్ చరణ్ ప్రతి రోజు తనకు అవసరమైన కేలరీలు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడానికే ఇష్టపడతారు. రామ్ చరణ్ ఎక్కువగా నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్, ఆలీవ్ నూనెలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటారు.
ఇక ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు ఆవు పాలు తీసుకోవడం అతనికి అలవాటు. ఇలా రామ్ చరణ్ ఎక్కువగా పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకపోయినా ఆవుపాలలో కావల్సినన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కనుక ప్రతిరోజూ ఉదయం ఆవు పాలు తీసుకుంటారు. ఇకపోతే తన భార్య ఉపాసన కూడా మంచి ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు కనుక రామ్ చరణ్ కూడా ఎక్కువగా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే జిమ్ లో పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ ఉంటారు.