సామ్ జామ్ కోసం స‌మంతాకు క‌ళ్ళు చెదిరే రెమ్యున‌రేష‌న్‌..!

ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా సరే.. పెళ్ళి చేసుకుంటే సినిమాలకు దూరం కావాల్సిందే.. అయితే ఇది ఒకప్పటి మాట. పెళ్ళి తర్వాత సినీ కెరీర్ మరింత బ్రైట్ గా మారుతుందనే విషయాన్ని సమంత నిరూపించింది. నిజానికి పెళ్ళి తర్వాతే తన సినీ కెరీర్ అద్భుతంగా రాణిస్తోంది. ఎంతోమంది హీరోయిన్లకు స్పూర్తిగా నిలుస్తోంది. ఇటు టాలీవుడ్ లోనే కాదు.. అటు కోలీవుడ్ లో కూడా సమంతకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలతో పాటు ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా స్టార్ట్ అయిన సామ్ జామ్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా మారి డిజిటల్ మీడియా దుమ్ము దులుపుతోంది. ఆహాలో టెలికాస్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ కి.. సమంత యాంకరింగ్ చాలా ప్ల‌స్ అయింది.

సామ్ జామ్ అంటూ విజయ్ దేవరకొండతో మొదలైన ఈ సీజన్.. ప్రస్తుతం తన భర్త నాగచైతన్య ని ఇంటర్వ్యూ చేసేవరకు వచ్చింది. నిజానికి ఈ కార్యక్రమం సామ్ అభిమానుల్నే కాక ఎంతో మంది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. సమంతా తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఓ టాక్ షోని రన్ చేయడం విశేషం. అయితే ఆహా ఆర్గనైజేషన్ సమంతాకు ఈ ప్రోగ్రామ్ కోసం భారీ పారితోషికాన్నే ఫిక్స్ చేసింది. మొత్తానికి పది ఎపిసోడ్లకు హోస్ట్ చేయడానికి సామ్ కు 1.5 కోట్లు చెల్లించింది. అంటే ఒక్కో ఎపిసోడ్ కి 15 లక్షల రూపాయల్ని చార్జ్ చేసింది సమంతా.

అయితే ఇప్పుడు కేవలం ఏడు ఎపిసోడ్లతోనే సామ్ జామ్ షోని కంప్లీట్ చేయబోతున్నారట. సామ్ భర్త అక్కినేని నాగ చైతన్యతో చేసిన ఇంటర్వ్యూతో ఈ కార్యక్రమాన్ని ఆపివేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. అయితే ఇంత సక్సెస్ ఫుల్ రేటింగ్ తో క్రేజ్ ని సంపాదించుకున్న సామ్ జామ్ ప్రోగ్రామ్ ని ఎందుకు ఆపివేయాలనుకుంటున్నారో సరైన కారణం తెలియదు. ఏది ఏమైనా ఈ ప్రోగ్రామ్ కోసం వేలాదిమంది అభిమానులు ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.